logo

ఆధ్యాత్మిక బంధువు లందరికీ శుభోదయం నిన్న అనగా మే 1వ తారీఖు నుండి12తారీఖు వరకు నర్మద నదికి పుష్కరాలు

ఆధ్యాత్మిక బంధువు లందరికీ శుభోదయం నిన్న అనగా మే 1వ తారీఖు నుండి12తారీఖు వరకు నర్మద నదికి పుష్కరాలు
జరుగుతున్నాయి అసలు నర్మద నది ప్రాముఖ్యత గురించి
ఒకానొకప్పుడు పరమ శివునికి
లోక కంఠకులైన త్రి పురాశురులను సంహరించడానికి అగోర అనే అస్త్రం అవసరం పడగ ఒక మనువంతరం వరకు ఘోర తపమును ఆచరించాడు అంత దీర్ఘ కాలం తపం ఆచరించి కనులు తెరవడం మూలంగా కన్నుల నుండి వెలువడిన21 ఆశ్రువులు 21రుద్రాక్షలు గా మారాయి అలాగే శరీరం నుండి వెలువడిన శ్వేత బిందువులు నర్మద నదిగా రూపు దాల్చడం జరిగింది అప్పుడు నర్మద హే పిత పరమ శివ నా తక్షణ కర్తవ్యం ఏమిటి అని అడగడం జరుగుతుంది అప్పుడు శివయ్య భూలోకం లో నర్మదా నదిగా అవతరించి ప్రవహించమని చెప్పడం జరుగుతుంది అప్పుడు హే పిత పరమాత్మ పవిత్ర గంగ నది వుండగా నాలో ఎవరు జప తప స్నానాలు ఆచరిస్తారు అని సంశయం వ్యక్తం చేస్తుంది
అప్పుడు శివయ్య హే నర్మదే గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో నీ న దిని కన్నులతో ధర్శిస్తేనే అంతకన్నా ఎక్కువ పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పడం జరుగుతుంది సంతృప్తి చెందిన నర్మద చాల రోజులు గడిచినా ఎవ్వరూ కూడా స్నానం ఆచరించక పోవడం తో కలత చెంది
పరమ శివునికి ఘోర తపము
ఆచరిస్తుంది శివయ్య ప్రత్యక్షమై వరం కోరుకొమ్మని అడిగినప్పుడు హే పిత ప్రజలెవ్వరు కూడా నానదిలో స్నానం ఆచరించడం లేదు నాలో ఏమైనా ప్రత్యేకతలు వుంటేనే కథ అందరూ స్నానం ఆచరిస్తారు అని అడిగినప్పుడు శివయ్య హే నర్మదే ఇకనుంచి ఎవరైనా సరే నర్మద అని స్మరించి నంతనే వారి మూడు జన్మల పాపాలు నశిస్తాయి అని నీలోని ప్రతి రాయిలోను నేను బాణ లింగం గా ఉంటానని ఈ భానలింగం అన్ని లింగాలకన్న శ్రే స్టమై విరాజిల్లుతుంది అని ఇట్టి లింగాన్ని కన్నులతో దర్శించి నంత నే సకల పాపాలూ నశించి పుణ్య ప్రాప్తి లభిస్తుంది అని ఇట్టి బాణలింగానికి ఒక సారి అభిషేకం చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాలను ఓకె సారి అభిషేకం చేసిన పుణ్య ఫలం ప్రాప్తిస్తుంది అని పుష్కర కాలం లో నీనది సన్నిధిలో పితృ కార్యక్రమాలు పిండ ప్రదానం జరిపిస్తే వెనుక వున్న 12తరాలు ముందు వుండే 12తరాల వంశికూలకు పుణ్య
లోక ప్రాప్తి లభిస్తుంది అని వరం ఇవ్వడం జరుగుతుంది
ఇంతటి గొప్ప ప్రాముఖ్యత కలిగిన నర్మద నది జన్మ స్థానం
అమర్కంట్ అక్కడే నర్మదా మాతా మందిరం వుంటుంది మందిరం పక్కన వున్న కోనేరు లోనే నర్మద నదీ ఉద్భవిస్తుంది
ఓంకారేశ్వర జ్యోతిర్లింగం కూడా నర్మధ నది ఒడ్డున ఉన్నది
ఈ పవిత్రమైన పుష్కర కాలం లో ప్రతి ఒక్కరూ దర్శించుకోండి
ఈవిషయాలన్ని లింగ మహాపురాణం లో లిఖించి వున్నాయి ఓం నమ శివాయ

మీ మహేష్ స్వామి చిలీవేరి
మంచిర్యాల

0
143 views